Logging In

లాగిన్ కావడానికి లాగిన్ మెను ఆప్షన్ క్లిక్ చేయండి. యూజర్లను అథెంటికేట్ చేయడానికి ఆన్ లైన్ సర్వీస్ ప్రొవైడర్లను వాడమని ఈ వెబ్ సైట్ సూచిస్తుంది. ఈ లాగిన్ పద్ధతికి సంబంధించిన ప్రాథమిక విషయాలు తెలుసుకోవడం ప్రాముఖ్యం. తరచూ ప్రతినిధులు అడిగే ప్రశ్నలు దీనికి సంబంధించినవే ఉంటాయి.

సెక్యురిటి ప్రొవైడర్లను వాడడం

పేజీకి పై భాగంలో సెక్యురిటి ప్రొవైడర్ల చిట్టా ఉంటుంది.

ప్రతీ ప్రతినిధి, తమ దరఖాస్తులో ఉపయోగించిన ఈ-మెయిల్ అడ్రసునే ఉపయోగించి లాగిన్ కావాలి. దాన్ని బట్టే అతను లేదా ఆమె ఏ ప్రొవైడర్లను ఎంచుకోవాలో తెలుసుకోవచ్చు.

ఉదాహరణకు: ఒక ప్రతినిధి john_delegate@gmail.com అనే ఈ-మెయిల్ అడ్రసు ఇచ్చాడనుకోండి, ఇప్పుడు అతను Google లింకును వాడాలి. అది అతన్ని లాగిన్ పేజీకి రీ-డైరెక్ట్ చేసి, Gmail అకౌంట్ తో లాగిన్ అవ్వమని అడుగుతుంది. అప్పుడు గూగుల్ సెక్యురిటీ ప్రొవైడర్ అతన్ని లేదా ఆమెను అథెంటికేట్ చేసి, ప్రత్యేక సమావేశాల ప్రైవేట్ సెక్షన్ కి తీసుకెళ్తుంది.

అలా చేస్తే, పాస్ వర్డ్స్ గానీ మరితర గోప్య సమాచారాన్ని గానీ ఈ వెబ్ సైట్లో స్టోర్ చేయాల్సిన అవసరం ఉండదు. లాగిన్ కావడానికి, అప్పటికే సిస్టమ్ కి తెలిసిన ఈ-మెయిల్ అడ్రస్ వాడితేనే, యూజర్ ని గుర్తించడం వీలౌతుంది.

పాస్ వర్డ్ అథెంటికేషన్ వాడడం

ఒక యూజర్, ఆన్ లైన్ సర్వీస్ ప్రొవైడర్ వాడే అవకాశం ఏమాత్రం లేకపోతే, పర్సనల్ పాస్ వర్డ్ రిక్వెస్టు చేసుకునే అవకాశాన్ని ఈ వెబ్ సైట్ కల్పిస్తోంది. యూజర్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు, ఒక ఈ-మెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా దరఖాస్తులో వాడిన ఈ-మెయిల్ అడ్రసే వాడాలి.

ఈ-మెయిల్ ద్వారా పాస్ వర్డ్ పంపబడుతుంది, దాన్ని సరిగ్గా అథెంటికేట్ చేయడానికి తప్పకుండా ఖరారు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ యూజర్ మెయిల్ అంటూ ఏదీ రాకపోతే, లేదా పాస్ వర్డ్ మర్చిపోతే, అతను లేదా ఆమె, నా పాస్ వర్డ్ మళ్లీ పంపించు ఆప్షన్ వాడుకోవచ్చు. అయినా సరే, అదే సమస్య పొడచూపితే, ఆతిథ్య కమిటీవాళ్లు వెబ్ సైట్ సపోర్ట్ టీమ్ సభ్యులను సంప్రదించవచ్చు.

ప్రతినిధిగా లాగిన్ అవ్వడం

ఒక యూజర్ విజయవంతంగా లాగిన్ అయినప్పుడు, తాను సమావేశ వాలంటీరుగా ఉండే ప్రతినిధా లేక స్థానిక ప్రచారకుడా అనే విషయాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

ప్రతినిధిగా అథెెంటికేషన్ ప్రక్రియను ముగించాలంటే, అతను లేదా ఆమె తమకు నియమించబడిన గ్రూపు ఐడిని ఎంటర్ చేయాలి. ప్రతినిధులు సహాయం కోసం తమ సంఘ కార్యదర్శని సంప్రదించాలని కోరుతున్నాం.

స్థానిక ప్రచారకులుగా లాగిన్ అవ్వడం

స్థానిక ప్రచారకులుగా అథెెంటికేషన్ ప్రక్రియను ముగించాలంటే, మీ సమావేశానికి వాలంటీర్ గా ఉండబోయే స్థానిక ప్రచారకుడు అందుబాటులో ఉన్న లిస్టులో నుండి ఆతిథ్య సమావేశాన్ని ఎంచుకోవాలి.

ఆ తర్వాత, తాను సహవసిస్తున్న సంఘాన్ని ఎంపిక చేసుకోవాలి. అతని సంఘానికి చెందిన ఇద్దరు కాంటాక్టు వ్యక్తులకు (సాధారణంగా పెద్దల సభ సమన్వయకర్త, సంఘకార్యదర్శి) ఈ-మెయిల్ పంపబడుతుంది. అప్పుడు వాళ్లు మీ గుర్తింపును ఖరారు చేసి, ఆతిథ్య కమిటికీ పంపే ముందు దరఖాస్తును ఆమోదించాలి.

గమనిక: వాలంటీర్లు అన్ని లాగిన్ పద్ధతులు వాడి లాగిన్ అయ్యి, దరఖాస్తు నింపవచ్చు. కానీ, సర్వీస్ ప్రొవైడర్లను వాడి లాగిన్ అయ్యేవాళ్లకు మాత్రమే ఆ తర్వాత సమాచారాన్ని సెక్యూరిటీ రిక్వైర్మెంటుగా డెలిగేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి పాస్ వర్డ్ అథెంటికేషన్ పద్ధతి కాకుండా సర్వీస్ ప్రొవైడర్లు ఉపయోగించమని వాలంటీర్లను ప్రోత్సరించండి.